జమ్మలమడుగు పట్టణంలోని నాలుగు రోడ్ల కూడలిలో ఫైర్స్ సిబ్బంది ప్రజలకు అగ్ని ప్రమాదాలపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలను ప్రజలకు వివరించారు. అలాగే సిబ్బంది వాటర్ తో విన్యాసాలు చేయించి ప్రజలకు అవగాహన కల్పించారు. అగ్ని ప్రమాదాలు జరగకుండా తీసుకోవలసిన జాగ్రత్తలను వివరించారు. ఈ కార్యక్రమంలో జమ్మలమడుగు ఫైర్ సిబ్బంది పాల్గొన్నారు.