జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి మంగళవారం ఎర్రగుంట్ల ఆర్టీపిపి ప్లాంట్ నిర్మాణంలో భూములు కోల్పోయిన రైతులతో కలసి విజయవాడలోని ఏపీ జెన్ కో ఎండీ చక్రధర్ని కలిశారు. రైతుల సమస్యలను ఆయనకు వివరించి వాటిని పరిష్కరించాలని ఎమ్మెల్యే కోరారు. వారి వెంట జమ్మలమడుగు టీడీపీ ఇన్ఛార్జ్ భూపేశ్ రెడ్డి టీడీపీ నాయకులు, తదితరులు ఉన్నారు.