రాజుల గురువాయిపల్లె గ్రామంలో సోమవారం ఉదయం జరిగిన శ్రీ గౌరీశంకర స్వామి, చౌడేశ్వర దేవి విగ్రహప్రతిష్ఠ గురువాయిపల్లె గ్రామ ప్రజల ఆహ్వానం మేరకు బీజేపీ మండల నాయకులు డాక్టర్ కటికరెడ్డి మధుసుదన్ రెడ్డి, కుమారుడు కటికరెడ్డి గుణవంత్ రెడ్డి గౌరీశంకర స్వామి, చౌడేశ్వరీ దేవి విగ్రహ ప్రతిష్ఠలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గ్రామంలో నిర్వహించిన ఎద్దుల పోటీలను ప్రారంభించారు. ఈకార్యక్రమానికి చుట్టుపక్కల గ్రామప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి స్వామివారి ఆశీర్వాదం పొందారు.