పులివెందులలో వైఎస్సార్సీపీ యువ నాయకులు డా. వైఎస్ అభిషేక్ రెడ్డి పార్థివదేహానికి జమ్మలమడుగు మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మూలె సుధీర్ రెడ్డి నివాళులర్పించారు. శనివారం వారి స్వగృహంలో డాక్టర్ అభిషేక్ రెడ్డి మృతదేహంపై పూలమాలవేసి ప్రగాఢ సానుభూతిని, సంతాపాన్ని వ్యక్తపరిచారు. వారి తండ్రి వైయస్ మదన్ మోహన్ రెడ్డిని, కడప పార్లమెంట్ సభ్యులు వైఎస్ అవినాశ్ రెడ్డిని పరామర్శించి సంతాపం ప్రకటించారు.