జమ్మలమడుగు: పెండింగ్ లో ఉన్న మూడు నెలల వేతనాలు ఇవ్వాలి

80చూసినవారు
జమ్మలమడుగు ప్రభుత్వ హాస్పిటల్ లో పనిచేస్తున్న కార్మికులకు పెండింగ్లో ఉన్న మూడు నెలల వేతనాలు ఇవ్వాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి మనోహర్ అధికారులను కోరారు. శనివారం జమ్మలమడుగు లో మాట్లాడుతూ ప్రభుత్వ హాస్పిటల్లో శానిటేషన్ కార్మికులకు మూడు నెలలు దాటితున్న వేతనాలు రాకపోవడం అన్యాయం అని తెలిపారు. జీవో నెంబర్ 549 ప్రకారం రూ. 16వేలు వేతన ఇవ్వాల్సి ఉండగా, 11800 వేలు మాత్రమే ఇస్తున్నారని ఆరోపించారు.

సంబంధిత పోస్ట్