జమ్మలమడుగు - ముద్దనూరు రోడ్డులోని పెన్నానదిలో నీటి గుంత ప్రమాదకరంగా మారింది. దీంతో పోలీసులు హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు. ఈ నీటి గుంతలో ఇప్పటివరకు దాదాపు పదిమంది ప్రాణాలు కోల్పోయారు. ఈనెల 7వ తేదీన హైదరాబాదుకు చెందిన తండ్రీకొడుకులు చనిపోవడానికి ఇదే కారణం. గుంతలు ఉన్నవి, ఈత కొట్టడం నిషేధం, అతిక్రమిస్తే శిక్షార్హులని అధికారులు హెచ్చరిక బోర్డును ఏర్పాటు చేశారు.