జమ్ములమడుగు: ప్రొద్దుతిరుగుడు పంటలో పొలంబడి శిక్షణా కార్యక్రమం

0చూసినవారు
జమ్ములమడుగు: ప్రొద్దుతిరుగుడు పంటలో పొలంబడి శిక్షణా కార్యక్రమం
రాజుగురువాయపల్లె గ్రామంలో శనివారం ప్రొద్దుతిరుగుడు పంటపై "పొలం బడి" కార్యక్రమాన్ని నిర్వహించినట్టు మండల వ్యవసాయ అధికారి మారెడ్డి వెంకట క్రిష్ణారెడ్డి తెలిపారు. 30 మంది రైతులకు 14 వారాల శిక్షణ ఇచ్చి, తక్కువ ఖర్చుతో అధిక దిగుబడులు సాధించే విధానాలు, సేంద్రియ పద్ధతులు, మేలైన యజమాన్య పద్ధతులు వివరిస్తామని పేర్కొన్నారు. రైతులను నిష్ణాతులుగా తీర్చిదిద్దడమే లక్ష్యమన్నారు.

సంబంధిత పోస్ట్