కొర్రపాడు గ్రామంలో రైతులతో గ్రామ సభ నిర్వహించారు. బుధవారం మండల వ్యవసాయ అధికారి వెంకట క్రిష్ణారెడ్డి గ్రామంలో సొంత పొలం కలిగిన ప్రతి రైతు తప్పకుండా రైతు విశిష్ట సంఖ్య కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అన్నారు. వ్యవసాయ శాఖ ద్వారా అమలు చేసే పథకాల గురించి అవగాహన కల్పించారు. పియం కిసాన్, అన్నదాత సుఖీభవ, సున్నా వడ్డీ పంట ఋణాల గురించి, వ్యవసాయ పరికరాల గురించి, పంట ఇన్సూరెన్సు మొదలగు పతకాలు రైతులకు వివరించారు.