కొండాపురం డిప్యూటీ తహశీల్దార్ గా పనిచేస్తున్న మీనా బదిలీలలో భాగంగా జమ్మలమడుగు ఆర్డీఓ కార్యాలయానికి నియమితులయ్యారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ శ్రీధర్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం జమ్మలమడుగు ఆర్డీఓ కార్యాలయంలో డిప్యూటీ తహసీల్దార్ గా పనిచేస్తున్న రూపేష్ మునిరావును కొండాపురం డిప్యూటీ తహసీల్దార్ గా బదిలీ చేశారు.