కొండాపురంలో రహదారి పనులు జరగక ముందే రోడ్డు పక్కనే సుధీర్ అనే వ్యాపారి రెండంతస్తుల భవనాన్ని నిర్మించుకున్నాడు. కొండ ప్రాంతమే కదా అని తక్కువ ఎత్తులో కట్టుకున్నాడు. దీంతో అతని ఇంటి నుంచి 6 అడుగుల ఎత్తులో 4 లైన్ల రహదారి పనులు జరుగుతున్నాయి. చేసేదేమీ లేక భవనాన్ని 6 అడుగులు పైకి ఎత్తడానికి 2 నెలల ఒప్పందంతో పనులు మొదలుపెట్టారు. 10 రోజులకే 35 మంది కార్మికులు 400 జాకీలతో మూడున్నర అడుగులు ఎత్తుకు లేపారు.