జమ్మలమడుగు నియోజకవర్గంలో ఆసక్తికర ఘటన జరిగింది. కొండాపురంలో ప్రస్తుతం రోడ్డు విస్తరణ పనులు జరుగుతున్నాయి. ఈక్రమంలో సుధీర్ శెట్టి అనే వ్యాపారి నిర్మించుకున్న రెండు అంతస్తుల భవనం రోడ్డు కన్నా తక్కువ ఎత్తులోకి వచ్చేసింది. దీంతో ఆయన జాకీల సాయంతో ఇంటిని అడుగు మేర పైకి లేపారు. ఇలాంటి తరహా పని శుక్రవారం కొండాపురంలో మొదటిసారి కావడంతో ప్రజలు వచ్చి ఆసక్తిగా చూస్తున్నారు.