విద్యుత్ షాక్ తో వ్యక్తి మృతి

80చూసినవారు
విద్యుత్ షాక్ తో వ్యక్తి మృతి
ముద్దునూరు మండలం యామవరం గ్రామపొలంలో కుందేళ్ల వేటగాడు మల్లయ్య విద్యుత్ షాక్ కు గురై మృతి చెందినట్లు ఎస్ఐ మైన్ ద్దీన్ తెలిపారు. వివరాలిలా. పెనికలపాడు చెందిన మల్లయ్య కుందేలను వేటాడేందుకు గురువారం రాత్రి పొలాల వద్దకు వెళ్లాడు. త్రాగునీటి కోసం వ్యవసాయ బోరు వద్దనున్న స్టార్టర్ ను ఆన్ చేయగా ప్రమాదవశాత్తు విద్యుత్ తగిలి మృతి చెందాడు. మృతుని భార్య మల్లమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు.

సంబంధిత పోస్ట్