గండికోట ప్రాజెక్టు పూర్తి స్థాయి కెపాసిటీ 26. 85 టిఎంసిలు కాగా ప్రస్తుతం ఆదివారం ఉదయం నాటికి గండికోట జలాశయం లో కనిష్ఠ స్థాయికి చేరి 2. 49 టీఎంసీల నీరు నిల్వ ఉంది. గండికోట జలాశయం నుండి తప్పని పరిస్థితిల్లో నీటిని మైలవరం రిజర్వాయర్ కు తరలించాలంటే అత్యవసర గేట్ల నుంచి విడుదల చేయాల్సిన పరిస్థితి నెలకొంది. ఎగువ నుంచి నీటి ప్రవాహం లేకపోవడంతో జలాశయంలో నీటిమట్టం కనిష్ట స్థాయికి చేరుకుంది.