ముద్దనూరు మండలం ఉప్పలూరు గ్రామంలో శనివారం, జ్యోతుల మహోత్సవం ఘనంగా నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా సాయంత్రం బిందె సేవ, రాత్రి జ్యోతి మహోత్సవం, కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. యూత్ ఆధ్వర్యంలో రాత్రి కేరళ వాయిద్యం, ఒంగోలు వారిచే అమ్మవారి
వేషధారణ నృత్యాల ప్రదర్శనను సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేసినట్లు ఉత్సవ కమిటీ సభ్యులు తెలిపారు.