కొండాపురం ఏఐటీయూసీ కార్యాలయంలో జాతీయ జెండాకు వందనం

84చూసినవారు
కొండాపురం ఏఐటీయూసీ కార్యాలయంలో జాతీయ జెండాకు వందనం
కొండాపురం పట్టణంలో సిపిఐ మండల అధ్యక్షుడు మనోహర్ బాబు, ఏఐటీయూసీ మండల ప్రధాన కార్యదర్శి పి. వెంకటరమణ, సుబ్బారావు ఏఐటీయూసీ కార్యాలయంలో గురువారం జాతీయ జెండా ఎగురవేశారు. 1947 ఆగస్టు 15వ తేదీన మన దేశం బానిసత్వం నుండి విముక్తి పొందిన రోజని అందువల్ల ఆగస్టు 15న ఘనంగా జరుపుకుంటున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో బహదూర్, ప్రసాద్, తారా దేవి మోహన్, వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్