మైలవరంలో రోడ్డు ప్రమాదం

81చూసినవారు
మైలవరంలో రోడ్డు ప్రమాదం
మైలవరం మండలం చిన్నకొమ్మెర్ల వద్ద గురువారం జమ్మలమడుగు దిశగా వెళ్తున్న లారీ, ఎదురుగా వస్తున్న బైక్‌ను ఢీకొంది. ఓ వ్యక్తి తన కూతురు, మనవరాలితో కల్వటాల గ్రామానికి బైకుపై వెళ్లుతుండగా ఈ ఘటన జరిగింది. అదృష్టవశాత్తు వారు స్వల్ప గాయాలతో తప్పించుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు వారిని జమ్మలమడుగు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత పోస్ట్