ఈ ఏడాది విడుదలైన 10వ తరగతి పరీక్షా ఫలితాలలో ఉత్తమ ప్రతిభ కనబరిచి కొండాపురం మండలానికి చెందిన 5 మంది విద్యార్థులు షైనింగ్ స్టార్స్ అవార్డుకు ఎంపికయ్యారు. శివాన్విత, త్రైతదేవి, సంయుక్త, మనోజ్ఞ,
వరుణ్ లు జిల్లా కలెక్టర్ శ్రీధర్ చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు. దాంతో పాటు రూ. 20 వేల చెక్, ప్రశంసా పత్రం అందజేశారు. అవార్డు పొందడంపై తల్లిదండ్రులు, పాఠశాల యాజమాన్యం హర్షం వ్యక్తం చేశారు.