సూర్యప్రభ వాహనంపై శ్రీనివాసుడి ఊరేగింపు

82చూసినవారు
జమ్మలమడుగు పట్టణంలోని శ్రీనారాపుర వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా 8వరోజు మంగళవారం నారాపుర వెంకటేశ్వర స్వామిని అర్చకులు, సిబ్బంది సూర్యప్రభ వాహనంపై పురవీధుల్లో అట్టహాసంగా ఊరేగింపు నిర్వహించారు. మహిళలు, చిన్నారులు లయబద్ధంగా నాట్యమాడుతూ కోలాటం వేశారు. కార్యక్రమంలో టిటిడి నారాపుర వెంకటేశ్వర స్వామి దేవాలయ అర్చకులు, ఆలయ అధికారి, భక్తులు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్