జిల్లాలో సెయిల్ ఆధ్వర్యంలో స్టీల్ ప్లాంట్
ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ సీనియర్ నేత తులసిరెడ్డి డిమాండ్ చేశారు. ఆదివారం జమ్మలమడుగులో ఆయన మాట్లాడుతూ రాయలసీమ ప్రాంతంలో నిరుద్యోగ సమస్యను పరిష్కరించేందుకు కాంగ్రెస్ రాష్ట్ర విభజన సమయంలో చట్టంలో చేర్చిందన్నారు. 2014, 19 ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఉంటే స్టీల్ ప్లాంట్ పూర్తయ్యేదన్నారు. ప్రభుత్వం చిత్తశుద్ధి ఉంటే స్టీల్ ప్లాంట్ నిర్మించాలన్నారు.