కడప జిల్లా జమ్మలమడుగులో విజ్ఞాన్ స్కూల్ ఆవరణంలో గురువారం స్వాతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏపీ రాష్ట్ర హస్తకళల అభివృద్ధి కార్పొరేషన్ మాజీ చైర్పర్సన్ విజయలక్ష్మి , జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చంద్రమౌళి చేనేత కళాకారులతో కలిసి జాతీయ జెండాను ఎగురవేశారు. ఎంతో కష్టపడి సంపాదించిన స్వాతంత్ర ఫలాలు దేశ జనాభా లో అత్యధిక శాతం ఉన్న బడుగు, బహహీన మైనారిటీ లకు చేoదాలన్నారు.