జమ్మలమడుగులోని మోరుగుడి, దొమ్మరనంద్యాల, వేపరాల గ్రామాల ప్రజలు అత్యధికంగా నేత పనిని వృత్తిగా కొనసాగిస్తూ ఉపాధిని పొందుతున్నారు. ప్రభుత్వాలు మారుతున్నా తమ జీవితాలు మాత్రం దయనీయ స్థితిలో ఉన్నాయంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చేనేత కార్మికులు జీవన పోరాటంలో అనేక కష్టనష్టాలు ఎదుర్కొంటున్నారు. పక్కా గృహాలు, సబ్సిడీతో కూడిన రుణాలు మంజూరు చేయాలని వారు కోరుతున్నారు.