మద్యం దుకాణాలకు దరఖాస్తు ప్రక్రియ పారదర్శకంగా నిర్వహించాలని కలెక్టర్ శివశంకర్ ఆదేశించారు. కలెక్టరేట్ లో సోమవారం అధికారులతో ఆయన సమీక్ష చేపట్టారు. జిల్లాలో మొత్తం 139 మద్యం దుకాణాల ఏర్పాటుకు త్వరలో నోటిఫికేషన్ ఇవ్వనున్నామని చెప్పారు. కడప పరిధిలో 30, సిద్దవటం-8, ఎర్రగుంట్ల- 14, జమ్మలమడుగు-14, ప్రొద్దుటూరు-19, పులివెందుల -16, ముద్దనూరు-7, మైదుకూరు-16, బద్వేలు-15 దుకాణాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు.