కడప: జూదమాడుతున్న 159 మంది అరెస్టు

174చూసినవారు
కడప: జూదమాడుతున్న 159 మంది అరెస్టు
అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ ఇ. జి అశోక్ కుమార్ హెచ్చరించారు. జిల్లాలో గత 15 రోజుల్లో చట్ట వ్యతిరేక కార్యకలాపాలపై జిల్లా పోలీస్ శాఖ జరిపిన దాడుల వివరాలను జిల్లా ఎస్. పి ఆదివారం వివరించారు. జిల్లాలో గత 15 రోజుల్లో జూదమాడుతున్న మొత్తం 159 మందిని అరెస్టు చేసి రూ. 2, 85, 645 నగదు స్వాధీనం చేసుకుని 22 కేసులు నమోదు చేయడం జరిగిందని ఎస్. పి తెలిపారు

సంబంధిత పోస్ట్