వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని శుక్రవారం కడప నగరంలోని దేవుని కడపలో ఘనంగా వైకుంఠ ద్వారం ద్వారా శ్రీ వెంకటేశ్వర స్వామిని భక్తులు దర్శనం చేసుకున్నారు. తెల్లవారుజామున నుండి భక్తులు స్వామివారి దర్శనం కొరకు క్యూ లైన్ లో బారులు తీరారు. ఉత్తర ద్వార దర్శనం అనంతరం ఆలయంలోని మూల విరాట్ శ్రీ వెంకటేశ్వర స్వామి, పద్మావతి దేవిని దర్శించుకున్నారు.