విశాఖ ఉక్కు ప్రేవేటికరణకు వ్యతిరేకంగా విశాఖ ఉక్కు పరిరక్షణ సమితి, కార్మిక, రైతు సంఘాల ఐక్యవేదిక పిలుపులో భాగంగా బుధవారం కేంద్ర కార్మిక రైతు సంఘాల ఆధ్వర్యంలో కడప నగరంలోని ఒకటో గాంధీ బొమ్మ ఎదురుగా నిరసన దీక్షలను ఏఐటియుసి ఆధ్వర్యంలో ప్రారంభించారు. అనంతరం గాంధీ విగ్రహానికి వినతిపత్రాన్ని అందజేశారు. కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి విశాఖ ప్రైవేటీకరణను నిలుపుదల చేయాలన్నారు.