శుక్రవారం అఖిల భారతీయ విద్యార్ధి పరిషత్ కడప నగర శాఖ ఆధ్వర్యంలో జీవో నం 77 రద్దు చెయ్యాలని, పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయాలని, తల్లికి వందన పథకాన్ని వెంటనే అమలు చేయాలని, విధానాన్ని వెనక్కి తీసుకోవాలని మరియు సాంఘిక సంక్షేమ హాస్టల్స్ లలో మౌలిక వసతులు కల్పించాలని ఏబీవీపీ డిమాండ్ చేస్తూ కడప నగరంలోని జంక్షన్ సర్కిల్ దగ్గర నిరసన కార్యక్రమం చేయడం జరిగింది.