సబ్జెక్టు ఉపాధ్యాయుల కొరత తీర్చండి

56చూసినవారు
సబ్జెక్టు ఉపాధ్యాయుల కొరత తీర్చండి
ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో సబ్జెక్టు ఉపాధ్యాయుల కొరత తీర్చాలని యూటీఎఫ్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మాదన విజయకుమార్, పాలెం మహేష్ బాబు కోరారు. కడపలో శుక్రవారం డీఈవో అనురాధను యూటీఎఫ్ నాయకులు కలిసి వినతిపత్రం అందజేశారు. ఉన్నత పాఠశాలలో పనిచేస్తూ ఇటీవల ఉద్యోగ విరమణ చేసిన సబ్జెక్టు ఉపాధ్యాయుల స్థానంలో సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయులకు ఉద్యోగ ఉన్నతులు కల్పించాలని సూచించారు.

సంబంధిత పోస్ట్