వైయస్సార్సీపి కడప నగర అధ్యక్షునిగా ఎస్. బి. అంజాద్ బాషాను వైఎస్ఆర్సిపి కేంద్ర కార్యాలయం శుక్రవారం నియమించింది. ఈ మేరకు కేంద్ర పార్టీ కార్యాలయం నుండి శుక్రవారం రాత్రి ఒక ప్రకటన విడుదల చేశారు. మాజీ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్ సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు అంజాద్ భాషాను కడప నగర పార్టీ అధ్యక్షులుగా నియమించారు.