జూనోసిస్ దినోత్సవాన్ని పురస్కరించుకుని కడప పాలీ క్లినిక్ లో ఆదివారం నిర్వహించిన కార్యక్రమంలో కలెక్టర్ శ్రీధర్ మాట్లాడారు. శునకాలకు యాంటీ రేబీస్ టీకాలు తప్పనిసరిగా వేయాలన్నారు. జిల్లాలో 17వేల టీకా డోసులు సిద్ధంగా ఉన్నాయని, అన్ని గ్రామాల్లో ఉచితంగా అందిస్తున్నామని చెప్పారు. జూలై 7 నుంచి 14 వరకు పశుగ్రాస వారోత్సవాలు నిర్వహిస్తామని వెల్లడించారు.