కడప నగరం కృపా కాలనీకి చెందిన పాస్టర్ పి. మహేష్ ను ప్రపంచ మానవ హక్కుల అవగాహన సంఘం జిల్లా గౌరవ సలహాదారులుగా నియమితులయ్యారు. అదే విధంగా సిటీ వైస్ ప్రెసిడెంట్ గా పి. రవితేజ బాధ్యతలు చెపట్టారు. బుధవారం కడప పట్టణంలోని పాత బస్టాండ్ సమీపం లో జరిగిన సమావేశానికి గ్లోబల్ హ్యూమన్ రైట్స్ అవేర్నెస్ అసోసియేషన్ వ్యవస్థాపకులు కాసల కోనయ్య, జిల్లా చైర్మన్ లోకేష్ లు హాజరై పలు అంశాలపై చర్చించారు.