కడపలో శనివారం అర్ధరాత్రి దొంగలు ఏటీఎంలో చోరీకి పాల్పడ్డారు. కడప నగరంలోని ద్వారకా నగర్ ఇందిరా భవన్ ఎదురుగా ఉన్న ఎస్బీఐ ఏటీఎం ప్లాను పగులగొట్టి నగదును దోచుకెళ్లారు. విషయం తెలుసుకున్న కడప వన్ టౌన్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. ఎటీఎంలో రూ. 6 లక్షల నగదు చోరికి గురైనట్లు అధికారులు నిర్ధారించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.