రేపు కడప కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించే ప్రజా ఫిర్యాదుల స్వీకరణ కార్యక్రమం రద్దు చేసినట్లు జిల్లా కలెక్టర్ శివ శంకర్ ఓ ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం 100 రోజుల పాలన పూర్తైన సందర్భంగా చేస్తున్న గ్రామసభలు, ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో అధికారులు నిమగ్నమై ఉండటంతో ఈ సోమవారం జరిగే కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు తెలిపారు. ప్రజలు గమనించి కలెక్టర్ కార్యాలయంకు రావద్దని సూచించారు.