కడప నగరం తాలూకా పోలీస్ స్టేషన్ నందు మంగళవారం ఎస్పీ ఆదేశాల మేరకు అన్ని మతాల గురువులతో పీస్ కమిటీ సమావేశం నిర్వహించారు. సీఐ రెడ్డప్ప మాట్లాడుతూ, ఎలాంటి అవాంచనీయ సంఘటనలు, దొంగతనాలు, దాడులు జరగకుండా చర్చిలు, మసీదులు, గుడిల దగ్గర సీసీ కెమెరాలు అమర్చుకోవాలని మత పెద్దలను కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్సైలు తాహిర్ హుస్సేన్, తులసి నాగప్రసాద్, పాస్టర్ పి. మహేష్, బిషప్ దానియేలు మత పెద్దలు పాల్గొన్నారు.