కడప విమానాశ్రయంలో తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయ నిర్మాణ ఆకృతుల గోడపత్రాలను సీఎం చంద్రబాబు శనివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిర్మాణంలో నాణ్యత లోపం కనిపించకూడదన్నారు. పనులను వేగవంతంగా పూర్తి చేయాలని ఆదేశించారు, ఉభయ కడప జిల్లా నేతలందరూ కలిసి భూమి పూజ చేయాలని స్పష్టం చేశారు. కార్యక్రమంలో కడప జిల్లా టీడీపీ నేతలు ఉన్నారు.