రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కారానికి అధిక ప్రాధాన్యతనిస్తోందని, అధికారులు ప్రజా సమస్యలను నిర్లక్ష్యం చేయకుండా పరిష్కరించాలని రాష్ట్ర రవాణా, యువజన క్రీడా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. శనివారం చిన్నమండెం మండలం, బోరెడ్డి గారిపల్లెలోని తమ నివాసం నందు మంత్రి ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జిల్లాలో పనిచేస్తున్న వివిధ శాఖల అధికారులు ప్రజా సమస్యల పరిష్కారానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలన్నారు.