గృహ నిర్మాణ పనులు నాణ్యతతో పూర్తి చేయండి

81చూసినవారు
గృహ నిర్మాణ పనులు నాణ్యతతో పూర్తి చేయండి
గృహ (హౌసింగ్) పథకంలో లబ్ధిదారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా గృహ నిర్మాణాలను నాణ్యతతో పూర్తి చేయాలని కడప జిల్లా కలెక్టర్ శివశంకర్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ లోని తన ఛాంబర్ లో కాంట్రాక్టర్లతో గృహ నిర్మాణాలపై జరిగిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ పక్క గృహాల నిర్మాణంలో నిర్దేశిత లక్ష్యాల సాధనలో నిర్లక్ష్యం వహిస్తే శాఖాపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్