పోలీసు అమర వీరుల సంస్మరణ వారోత్సవాల సంధర్బంగా.. జిల్లా పోలీసు కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఓపెన్ హౌస్ ఎగ్జిబిషన్ ను కడప జిల్లా ఎస్పీ వి. హర్షవర్ధన్ రాజు శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ.. పోలీసులు విధి నిర్వహణలో భాగంగా వారు వినియోగించే ఆయుధాలు, దుస్తులు, పనిముట్ల, నేరదర్యాప్తు విధానం తదితర విషయాలను విద్యార్దులకు తెలియజేయడానికి ఈ ఓపెన్ హౌస్ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.