లడ్డూ నాణ్యతపై విచారణకు డిమాండు

57చూసినవారు
తిరుమల లడ్డూలో నెయ్యి కల్తీకి పాల్పడినవారిపై విచారణ చేసి కఠిన చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ కడప జిల్లా అధ్యక్షురాలు విజయజ్యోతి పేర్కొన్నారు. శనివారం పార్టీ కడప జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. తిరుమల దేవస్థానం పవిత్రమైంది, అక్కడ ఇచ్చే ప్రసాదంపై భక్తులకు విశ్వాసం, నమ్మకం ఉంది. అలాంటి లడ్డులో నెయ్యి కల్తీకి పాల్ప డటం దారుణమన్నారు.

సంబంధిత పోస్ట్