కడప పట్టణంలోని వైయస్ఆర్ ప్రెస్ క్లబ్ లో మంగళవారం జరిగిన శ్రీ వెంకటలక్ష్మి చారిటబుల్ ట్రస్ట్ మొదటి వార్షికోత్సవం సందర్భంగా సమాజ శ్రేయస్సు కోసం కృషిచేసిన అభి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ ఎన్. విజయబాబుకు సేవ రత్న పురస్కారం లభించింది. ఆయన మానవత్వంతో సేవా కార్యక్రమాలు చేస్తూ ఎంతోమందికి అన్నదానం, రక్తదానం, వికలాంగులకు వీల్ చైర్లు, రోడ్ల పైన ఉన్నటువంటి అనాధల అభాగ్యులకు అంత్యక్రియలు నిర్వహించారు.