వందేళ్ళలో ఎన్నడూ సంభవించని వరద ప్రళయాన్ని జాతీయ విపత్తుగా ప్రకటించాలని, ప్రధాని మోడీ వరద ప్రభావిత ప్రాంతాలలో పర్యటించి ఆంధ్ర, తెలంగాణను ఆదుకోవాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎ. రామ్మోహన్ కోరారు. బుధవారం కడప సిపిఎం జిల్లా కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెండు తెలుగు రాష్ట్రాల్లో వరద ప్రళయం లక్షలాది మందిని నిరాశ్రుయులను చేసిందని తెలిపారు.