గ్రామీణ మహిళలకు ఉచిత శిక్షణ

78చూసినవారు
గ్రామీణ మహిళలకు ఉచిత శిక్షణ
గ్రామీణ ప్రాంత నిరుద్యోగ మహిళలకు జులై ఒకటో తేదీ నుంచి నెల రోజుల పాటు కడప నగర శివార్లలోని కెనరాబ్యాంక్ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థలో ఉచితంగా శిక్షణ ఇవ్వనున్నట్లు ఆ సంస్థ డైరెక్టరు నారాయణరెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. టైలరింగ్, బ్యూటీపార్లర్ మేనేజ్మెంట్, ఎంబ్రాయిడరీ-ఫ్యాబ్రిక్ పెయింటింగ్ శిక్షణ ఉంటుందన్నారు. 18 నుంచి 45 సంవత్సరాల్లోపు వయసు కలవారు అర్హులన్నారు.

సంబంధిత పోస్ట్