నూతన మద్యం పాలసీ అమలులో భాగంగా షాపుల నిర్వహణకై ఈ నెల అక్టోబర్ 1 నుండి 9వతేది వరకు ఆశక్తి కలిగిన వారు దరఖాస్తు చేసుకోవచ్చునని కడప కలెక్టర్ శివశంకర్ తెలిపారు. మంగళవారం కలెక్టరేట్ లో అధికారులతో కలిసి కలెక్టర్ నూతన మద్యం పాలసీపై విలేకరుల సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ నూతన మద్యం పాలసీ జీవో ఎంఎస్ 211, షాప్ రూల్స్ 2024 ప్రకారం లైసెన్స్ పీరియడ్ 12- 10-24 నుండి 30-09 2026 వరకు ఉంటుందన్నారు.