అమరావతి మహిళలపై సాక్షి టీవీలో చేసిన అనుచిత వ్యాఖ్యలు చాలా దారుణమని రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల సోమవారం అన్నారు. ఇంతవరకూ వైసీపీ, సాక్షి మీడియా క్షమాపణ చెప్పలేదన్నారు. మహిళలతో చేసిన తప్పుకు సాక్షి ఛైర్మన్ భారతీరెడ్డి క్షమాపణ చెప్పాల్సిన బాధ్యత ఉంది. జగన్ క్షమాపణ కోరినా తప్పేమీ లేదని, అలా చేస్తే తాను సంతోషిస్తానని పేర్కొన్నారు.