కడపలో సెక్షన్ 30 పోలీసు యాక్టు అమలు

74చూసినవారు
కడపలో సెక్షన్ 30 పోలీసు యాక్టు అమలు
అక్టోబర్ నెల 1వ తేదీ నుంచి 31 వ తేదీ వరకు కడప పోలీసు సబ్ డివిజన్ పరిధిలో సెక్షన్ 30 పోలీసు యాక్టు అమలులో ఉంటుందని కడప ఇంచార్జ్ డీ. ఎస్పీ రమాకాంత్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎలాంటి సభలు, సమావేశాలు, ర్యాలీలు, నిరసన కార్యక్రమాలు చేపట్టాలoటే 24 గంటల ముందు లిఖితపూర్వకంగా పోలీసులకు అర్జి ఇచ్చి వారి నుండి ముందస్తు అనుమతి తీసుకోవాలన్నారు. అలా కాని పక్షములో చట్టపరమైన చర్యలకు బాధ్యులు అవుతారని తెలిపారు.

సంబంధిత పోస్ట్