జమ్మలమడుగు: పార్లమెంటు సమావేశాలలో కడప ఉక్కుపై చర్చించాలి

64చూసినవారు
జమ్మలమడుగు: పార్లమెంటు సమావేశాలలో కడప ఉక్కుపై చర్చించాలి
ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంటు సమావేశాలలో విభజన హామీలలో భాగమైన కడప ఉక్కుపై చర్చ జరపాలని డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి వీరణాల శివకుమార్ డిమాండ్ చేశారు. ఎర్రగుంట్లలో స్థానిక ఐటీఐ కళాశాల నందు బుధవారం మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కడప ఉక్కుపై నిర్లక్ష్యం వహిస్తున్నదని అన్నారు. విభజన హామీలలో భాగమైన కడప ఉక్కు పరిశ్రమ ఇన్ని సంవత్సరాలుగా ఎందుకు నిర్మించలేదని ప్రశ్నించారు.

సంబంధిత పోస్ట్