భారత కమ్యూనిస్టు పార్టీ కడప జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈనెల 27వ తేదీ ఉదయం 10 గంటలకు కడప ప్రెస్ క్లబ్ లో అఖిల భారత ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి సంస్మరణ సభను విజయవంతం చేయాలని సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు కామనురు శ్రీనివాసులు రెడ్డి తెలిపారు. శనివారం స్థానిక సి. పి. ఎం. శాఖ సమావేశంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏచూరీ సంస్మరణ సభను జయప్రదం చేయాలని కోరారు.