కడప: ప్రమాదవశాత్తు బేల్దారీ మృతి

61చూసినవారు
కడప: ప్రమాదవశాత్తు బేల్దారీ మృతి
ఓ బేల్దారీ ప్రమాదవశాత్తూ మృతి చెందిన ఘటన కడపలో చోటుచేసుకుంది. గుంటూరు జిల్లా పొన్నూరుకు చెందిన శ్రీనివాస్ (40) కొంతకాలం కిందట కడపకు వచ్చి స్థిరపడ్డారు. బేల్దారీ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. నగరంలోని నెహ్రూ పార్కు సమీపంలో సోమవారం ఓ ఇంటి నిర్మాణ పనులు చేస్తుండగా ప్రమాదవశాత్తూ జారి కింద పడిపోయారు. చికిత్స నిమిత్తం రిమ్స్ కు తరలించారు. చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందారు.

సంబంధిత పోస్ట్