జిల్లా స్వచ్ఛంద సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో జూలై 10 నుంచి జూలై 16 వరకు నిర్వహిస్తున్న ద్వితీయ వార్షిక రక్తదాన వారోత్సవాల పోస్టర్స్ ను జిల్లా కలెక్టరేట్ లో శనివారం జిల్లా రెవిన్యూ అధికారి విశ్వేశ్వర నాయుడు ఆవిష్కరించారు. డిఆర్ఓ మాట్లాడుతూ రక్తం యొక్క ఆవశ్యకతను ప్రతి ఒక్కరు దృష్టిలో ఉంచుకొని రక్తదానం చేసేందుకు ముందుకు రావాలన్నారు. ద్వితీయ వార్షిక రక్తదాన వారోత్సవాలు ప్రతి ఒక్కరు విజయవంతం చేయాలన్నారు.