చెన్నూరు ప్రాంతానికి చెందిన ఓ యువతిపై జరిగిన అత్యాచారం కేసులో నిందితుడికి జీవిత ఖైదు పడింది. ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలం మద్దిరాలపాడుకు చెందిన వెంకటేశ్, సోషల్ మీడియా ద్వారా యువతితో పరిచయమయ్యాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి అనేకసార్లు అఘాయిత్యానికి పాల్పడ్డాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు విచారణ నిర్వహించిన కోర్టు ఆయనకు మంగళవారం రూ.1.5 లక్షల జరిమానాతో పాటు జీవిత ఖైదు విధించింది.