వేపరాల: వేపరాలలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు మహిళలు పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ శ్రీదేవి ఆధ్వర్యంలో తల్లులు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ‘తల్లికి వందనం’ పథకం కింద ప్రతి విద్యార్థికి డబ్బులు జమ చేశారని ఆమె తెలిపారు. అలాగే ఆగస్టులో మహిళలకు ఉచిత బస్సు సదుపాయం అందుబాటులోకి రానుందని పేర్కొన్నారు.